నా ఆలోచనలకు పదాలు వెతుకుతున్న
నా ఆవేదన కి అర్ధం వెతుకుతున్న
జీవితం అనే ప్రయాణం లో నా దారి వెతుకుతున్న
నిజాన్ని వెతుకుతున్న, నిజంగా వెతుకుతున్న
డబ్బు సుఖం కాదనీ కొనలెదనీ చదివించి మెప్పించి
ప్రాణం మానం వదులుకొని డబ్బు వెంట పిచ్చి కుక్క లా పడుతున్టే
నేర్చుకున్నది తప్పో ... రాబోయేది ముప్పో తేల్చలేక బిత్తర పోతున్న
తప్పని నేర్చినదే గొప్పని చేస్తుంటే
ప్రశ్నించాల? ప్రశ్నించుకోవాల?
మార్చాల? మారిపోవాల?
ఫలం ఆశించక కృషి చేయమని శాస్త్రాలు నేర్చి మరిచి
దారి కన్నా గమ్యం ముఖ్యం అని పక్క త్రోవ పడుతుంటే
వేసేది ముందడుగో ... చేరేది వినాసపు మడుగు తోచక దిక్కులు చూస్తున్న
న్యాయమని నియమించి దాని పై నవ్వుతుంటే
ఆపాల? ఆగిపోవాల?
భయపెట్టాల? భయపడాల?
నా ఆలోచనలకు అర్ధం ఉందా అని ఆలోచిస్తున్న
నా ఆవేదన కి అంతం ఉందా అని ఆలోచిస్తున్న
జీవితం అనే ప్రయాణం లో నా దారి సరైనదేనా అని ఆలోచిస్తున్న
నిజం అనేది ఉందా అని ఆలోచిస్తున్న, నిజంగా ఆలోచిస్తున్న.
Text in English:
Naa aalochnalaku padaalu vethukuthunna
Naa aavedana ki ardham vethukuthunna
Jeevitham ane prayaanam lo naa daari edani vethukuthunna
Nijaaanni vethukuthunna, nijanga vethukuthunna
Dabbu sukham kaadanee konaledanee chadivinchi meppinchi
Praanam maanam vadulukoni dabbu venta pichi kukka la paduthuntey
Nerchukunnadi thappo... Raaboyedi muppo thelchaleka bithiri pothunna
Thappani nerchindey goppani chesthuntey
Prashninchaala? Prashninchukovaala?
Maarchaala? Maaripovaala?
Phalam aashinchaka krushi cheyamani shashtraalu nerchi marichi
daari kanna gamyam mukhyam ani chedu/pakka throva paduthuntey
Vesedi mundadugo... Cheredi vinaasapu madugu tochaka dikkulu chusthunna
Nyaayamani niyaminchi daani pai navvuthuntey
Aapaala? Aagipovaala?
Bhayapettaala? Bhyapadaala?
Naa aalochanlaku ardham unda ani alochisthunna
Naa aavedana ki antham unda ani alochisthunna
Jeevitham ane prayaanam lo naa daari saraindena ani alochisthunna
Nijam anedi unda ani alochisthunna, nijanga aalochisthunna.
No comments:
Post a Comment